నిన్న (1/2/2012) న ప్రతేకాధికారి మరియు మండల అభివృద్ధి అధికారి వారు విద్యార్ధుల ఉత్తీర్ణతా శాతాన్ని చూచి సంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ బడికి మానివేస్తున్న 10 మంది పిల్లల బాధ్యతలను గ్రామాధికారి గారిని వెను వెంటనే పర్యవేక్షించవలసిందిగా ఆదేశించారు. విద్యార్ధులను ఉద్దేశించి మండల అభివృద్ధి అధికారి విజయ రాజు,ప్రత్యేకాధికారి నరస రాజు నవ్విస్తూ,మంచి సలహాలు,సూచనలూ అందించి పిల్లలను ఉత్సాహ పరిచారు.
నేడు(2/2/2012)జిల్లా విద్యాశాఖాధికారి వారు నియమించిన 10వ తరగతి విద్యార్ధులను దర్శించిన పాలకొల్లు మండల మానిటరింగ్ బృందం.ఈ రోజు మా పాఠశాల 10వ తరగతి విద్యార్ధుల ప్రగతిని మానిటరింగ్ బృందం పర్యవేక్షించడానికి వచ్చింది.గడచిన అర్ధ సంవత్సర పరీక్షలలో విద్యార్ధులు సాధించిన ఉత్తీర్ణతా ఫలితాలను బేరీజు వేసుకొని రా బోయే 10వతరగతి పబ్లిక్ పరీక్షలలో ఈ పాఠశాల విద్యార్ధులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి,మన పాఠశాలకు వెనుక ఉన్న మంచి పేరును నిలబెట్టుకొని మార్కుల శాతాన్ని అధిగమించాలని కోరుతూ వివిధ బోధనా విషయములలో మెళకువలను పలువురు విద్యార్ధినీ విద్యార్ధులకు వివరించారు.సభలో మానిటరింగ్ గ్రూపు లీడర్ శ్రీ లక్ష్మీ నారాయణగారు ,దిగమర్రు ప్రధానోపాధ్యాయులు వివరించి నూటికి నూరుశాతం ఫలితాలు సాధించి మీ ఉపాధ్యాయులకు,తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని ఉద్బోధించారు.దానికి సంబంధించిన చిత్రాన్ని క్రింద పొందుపరుస్తున్నాము.
అతిధులుగా వచ్చిన మానిటరింగ్ బృందంతో మా 10 తరగతి విద్యార్ధులు మరియు మా ఉపాధ్యాయులు |
Blog organization is very good. Students will inspire by this.Good one. Keep going.
రిప్లయితొలగించండి