చాలా మంది తల్లిదండ్రులు ఈనాడు మా పిల్లలు మంచి సాహిత్యం, చదవాలి .వారిలో మానవతా విలువలు ,సాంస్కృతిక విలువలు పెరగాలి,ఆధ్యాత్మిక చింతన ప్రబలాలి, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక విలువలతో మా బిడ్డల శీల సంపదలు ఇనుమడింప చేయాలనే భావనే కానీ , అవి పెంపొందించడానికి మన వంతుగా ,మనమెంత కృషి చేస్తున్నాము?అనే ప్రశ్న నేటి సమాజంలోని ప్రతి తల్లీ,తండ్రి వేసుకో వలసిందే!మన వంతు బాధ్యతలను మనం సక్రమంగా ఎంత వరకూ నిర్వర్తిస్తున్నామా?అని !ఈ నాడు మేము నవ నాగరికులమని బోర విరుచుకొని చెప్పుకుంటున్న,వారి గృహాలు ఎక్కడ చూసినా ,సెక్స్ సాహిత్యం ,క్షుద్ర సాహిత్యం ,అర్ధ నగ్న దృశ్యాలతో కూడిన పనికి మాలిన సాహిత్యం ,డిటెక్టివ్ -నవలా సాహిత్యంతో,నిండి పోతూనే ఉందనే విషయం నేడు ఎవరూ కాదనలేరుగా?మరి !మన భావి తరాలెలా?తీర్చి దిద్దబడతారు?మనసు పెట్టి,కొంచెం ఆలోచించండి! సంస్కృతం,తెలుగు వంటి మన ప్రాచీన భాషలు పూర్తిగా మనకే రాక పోవచ్చును.నేర్చుకోవాలనే కోరిక మరియు అభిలాష కొందరికి ఏకోశానా లేకపోవచ్చును.మహాను భావులు ఎందరో మన కవులు ఎంతో పరిశ్ర మించి,కేవలం తెలుగు వచనంలోకి అనువదించిన అద్భుతమైన పూర్వ కావ్యాలు ఎన్నిలేవు?పురాణాలెన్ని లేవు? వాటిని కొంచెం సేపైనా ప్రతి రోజూ చదివించ వచ్చుగా?వాటిలో కొన్నైనా , అధమ పక్షం ఇంట్లోనైనా కొని, మన బిడ్డ చూసేలా ఉంచవచ్చుగా! గృహమొక పవిత్రమైన గ్రంధాలయంగా చేసుకోవచ్చుగా!వాటిని కొని ఇంట్లో ఉంచితే ఎప్పుడైనా ఒకసారి కాకపోతే వొకసారైనా ,వాడు తెరచి చూచే అవకాశం మనం కల్పించవచ్చుగా!భావి తరాలకు మంచి పుస్తకాలు ,సంస్కృతీ సాంప్రదాయాలు ,పుణ్య పురుషుల చరిత్రలు , అందించి,మన జాతిని జాగృతం చేసుకుందాం!ఇది తల్లి దండ్రుల మైన మనందరి బాధ్యతగా గుర్తెరిగిన వారు ధన్యులు.అందరినీ ఉద్దేసించి చెప్పిన విషయాలుగా భావించకండి!కొన్నిగృహాలు ఇందుకు భిన్నంగా మన ప్రాచీన ఆర్ష సాంప్రదాయపు ఒరవడిలో ఉండి ఉండవచ్చుకూడా ! అలాంటి వారికి నా జోహారులు.మన బిడ్దల నైతిక విలువల కోసం వేసవి ప్రత్యేక తరగతుల కోసం వేలకు వేలు ఫీజులు పోస్తున్నాం!వారిని ఉద్దేసించి మాత్రమే నా బాధ !మన్నిస్తారుగా!