1, జనవరి 2012, ఆదివారం

"కొంటె తెనాలి"

అది శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానం.
ఒక నాడు నేల మీద ఆకు పచ్చని తివాసీ పరిచారు.
సేవకులు.మంత్రులు,సామంతులు,దండ నాధులు, పురోహితులు,అష్ట దిగ్గజ కవులు,పౌరులు అందరూ కొలువు తీరి కృష్ణ దేవ రాయల వారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ సమయంలో రాయలు కూడా సభా మండపమైన భువన విజయ సభాస్థానానికి వేంచేశారు.
సభ ప్రశాంతంగా మొదలయింది.కేవలం ఆ సభకు హాజరు కానిదల్లా ఒక్క తెనాలి రామకృష్ణ కవి మాత్రమే.
ఈలోగా కొంత ఆలస్యంగా మన తెనాలి రామకృష్ణ కవి ఆస్థానంలోనికి ప్రవేసిస్తున్నాడు.
అతన్ని గుమ్మం దగ్గర చూడగానే,రాయల వారు నవ్వుతూ ఇలా అన్నాడు.
"కవి వృషభులకు స్వాగతం!ఈ పచ్చని తివాసీ మీ కోసమే వేయ బడింది."అన్నాడు.
వెంటనే మన రామ కృష్ణ కవి అందులోని వ్యంగాన్ని గుర్తించి ఇలా సమాధానమిచ్చాడు.
"కామ ధేనువు లాంటి ప్రభువులుండగా కవి వృషభులకు కొరతేమిటి ప్రభూ?"అని కొంటెగా చమత్కరించాడు.
అతనన్న మాట వల్ల తనకు దెబ్బ తగిలిన మాట వాస్తవమే! అయినా అతని అపార వైదుష్యాన్ని సహృదయతతో గుర్తించి అతని సమయ స్ఫూర్తిని బహుధా ప్రశంసిస్తూ అందరితో పాటు తానూ బిగ్గరగా నవ్వుతూ అతన్ని అభినందించాడు.
అదీ తెనాలి కొంటెతనంలో గొప్పదనం.అందుకే తెనాలి "కొంటె తెనాలి"గా కీర్తింపబడ్డాడు.

29, డిసెంబర్ 2011, గురువారం

మా శివ దేవుని చిక్కాల ఉన్నత పాఠ శాల అందచందాల దృశ్యాలు

 శివ దేవుని చిక్కాల ఉన్నత పాఠ శాల అందచందాల దృశ్యాలు
ప్రస్తుత మా పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు మరియు ప్రస్తుతపాలకొల్లు మండల విద్యా శాఖాదికారిణి
పైఅంతస్తు నుంచి   మాపాఠశాల  అందాలు 
రహదారి నుంచి అందాలు చిందే  మా పాఠశాల  భవంతులు
మా పాఠశాల ముంగిట నిత్యం పూజలందే చదువుల తల్లి మందిరం 
మా పాఠశాల  విద్యార్ధినీ విద్యార్ధుల ప్రతిభా వ్యుత్పత్తుల చిహ్నాలు 
పాఠశాలలో  ఒక ప్రక్కనుండి కనపడే కంప్యూటర్ గదుల సోయగం
పాఠశాలలో  వేరొక  ప్రక్కనుండి కనపడే కంప్యూటర్ గదుల సోయగం
మా పాఠశాల  వ్యవ స్థాపకులు విద్యా ప్రదాత స్వాతంత్ర సమర యోధులు 
శ్రీ  చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు గారి కాంస్య విగ్రహం
మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి  గది.
మా పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ భవనం మరియు వెనుక వంటశాల
ఇటీవల రాజీవ్ విద్యా మిషన్ వారు నూతనంగా నిర్మించిన తరగతి గదులు 
ఒక ప్రక్కనుండి చూస్తె మా మా పాఠశాలసభా భవనం 
ఈశా న్య  దిశను  నిండుగా ప్రవహించే చెరువు
మా పాఠశాల పదవ తరగతి సెక్షన్ విద్యార్ధినీ విద్యార్ధులు
మా పాఠశాల విశాలమైన ఆట ప్రాంగణం
వృక్షో రక్షతి రక్షిత:అనే సూక్తికి దృష్టాంతంగా చల్లని నీడనిక్చే సపోటా వృక్ష సముదాయం
దూరాన్నుంచి అలరారే మా పాఠశాల ఆటల  మైదానం
మా పాఠశాలకు నీడనిస్తూ ఫలవంతమైన సపోటా వృక్షాలు
ప్రశాంత వాతావరణంలో  దీటుగా నిలచిన మా పాఠశాల
ప్రశాంత వాతావరణంలో  దీటుగా నిలచిన మా పాఠశాల