27, ఫిబ్రవరి 2012, సోమవారం

అలంకార భేదాలు

10 వ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులు తెలుగులో అలంకారాన్ని సులభంగా గుర్తించడనికి ఒకే ఉదాహరణను  వేరు వేరు అలంకారలకు ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం!
ఉపమాలంకారం:- రాము చేతి అక్షారాలు ముత్యాల వలె గుండ్రంగా ఉంటాయి.
రూపకాలంకారం:-రాము చేతి వ్రాత అక్షర ముత్యాలు.
ఉత్ప్రేక్ష:-రాము చేతి వ్రాత అక్షర ముత్యాలో అన్నట్లున్నవి.
అతిశయోక్తి:-రాము చేతి వ్రాత అక్షరాలు ముత్యాలను మించి అందంగా ఉన్నాయి.
అర్ధాంతర న్యాసాలంకారం:-రాము చేతి వ్రాత అక్షర ముత్యాలే!బాగా చదివితే అది సాధ్యమే!

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

మా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం.


నుంచున్న వారువరుసగా:
కుమారి పద్మ(కంప్యూటర్స్),శ్రీ మతిస్వర్ణశ్రీ (లైబ్రరియన్), 
శ్రీ మతిఉష (ఆఫీస్ సుబార్డినేట్) శ్రీ మతి ప్రమీల (ఇంగ్లీష్ ఎస్.ఏ)
 శ్రీ మతి గీతా వాణి (ఇంగ్లీష్ ఎస్.ఏ)శ్రీ మతి శైలజ (సె.గ్రే
 శ్రీ మతి బేగం(హిందీ గ్రే-2)శ్రీ మతి తులసి రత్నమణి (ఫిజిక్సెఎస్.ఏ) కుమారి రమ (కంప్యూటర్స్),శ్రీ మతిఉష (ఫిజిక్స్ ఎస్.ఏ)
 శ్రీ మతి జయంతి (ఇంగ్లీష్ ఎస్.ఏ)పరదేశి (క్రాఫ్ట్
శ్రీ  కృష్ణా రెడ్డి (బి.ఎస్ ఎస్.ఏ)శ్రీ  చంద్ర రావ్ ( బి.ఎస్ ఎస్.ఏ
శ్రీ సముద్రం (రికార్డ్ సహాయకుడు)
కూర్చున్న వారు వరుసగా:
అర్క సోమయాజి (తెలుగు ఎస్.ఏ )(ఈ బ్లాగు నిర్వాహకుడు ) 
శ్రీ మతివిజయ కుమారి (సోషల్ ఎస్.ఏ)శ్రీ మతి విజయ లక్ష్మి(హింది ఎస్.ఏ
శ్రీ మతి జలజ రాణి (సోషల్ ఎస్.ఏ)కుమారి 
శ్రీ మతి ఉదయిని (హెచ్.ఎం)శ్రీ మతి హెలెన్ కుమారి (పి.డి
శ్రీ రామకృష్ణ శర్మ(తెలుగు ఎస్.ఏ) శ్రీ  హనుమంత రావ్ (లెక్కలు ఎస్.ఏ) శ్రీ  తాతయ్య (లెక్కలు ఎస్.ఏ) శ్రీ స్వామి (లెక్కలు ఎస్.ఏ)
శ్రీ  పూర్ణ చంద్ర రావు (బి.ఎస్,ఎస్.ఏ)(వీరు పై ఫోటోలో లేరు )  

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

10 వ తరగతి విద్యార్ధులకు అధికారుల సలహాలు-సూచనలు

నిన్న (1/2/2012) న ప్రతేకాధికారి మరియు మండల అభివృద్ధి అధికారి వారు విద్యార్ధుల ఉత్తీర్ణతా శాతాన్ని చూచి సంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ బడికి మానివేస్తున్న 10 మంది పిల్లల బాధ్యతలను గ్రామాధికారి గారిని వెను వెంటనే పర్యవేక్షించవలసిందిగా ఆదేశించారు. విద్యార్ధులను ఉద్దేశించి మండల అభివృద్ధి అధికారి విజయ రాజు,ప్రత్యేకాధికారి నరస రాజు నవ్విస్తూ,మంచి సలహాలు,సూచనలూ అందించి పిల్లలను ఉత్సాహ పరిచారు.

ఈనాడులో ఈ వార్తా ప్రత్యక్ష సాక్ష్యం 

                  నేడు(2/2/2012)జిల్లా విద్యాశాఖాధికారి వారు నియమించిన 10వ తరగతి విద్యార్ధులను దర్శించిన పాలకొల్లు మండల మానిటరింగ్ బృందం.ఈ రోజు మా పాఠశాల 10వ తరగతి విద్యార్ధుల ప్రగతిని మానిటరింగ్ బృందం పర్యవేక్షించడానికి వచ్చింది.గడచిన అర్ధ సంవత్సర పరీక్షలలో విద్యార్ధులు సాధించిన ఉత్తీర్ణతా ఫలితాలను బేరీజు వేసుకొని రా బోయే 10వతరగతి పబ్లిక్ పరీక్షలలో ఈ పాఠశాల విద్యార్ధులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి,మన పాఠశాలకు వెనుక ఉన్న మంచి పేరును నిలబెట్టుకొని మార్కుల శాతాన్ని అధిగమించాలని కోరుతూ వివిధ బోధనా విషయములలో మెళకువలను పలువురు విద్యార్ధినీ విద్యార్ధులకు వివరించారు.సభలో మానిటరింగ్ గ్రూపు లీడర్ శ్రీ లక్ష్మీ నారాయణగారు ,దిగమర్రు ప్రధానోపాధ్యాయులు వివరించి నూటికి నూరుశాతం ఫలితాలు సాధించి మీ ఉపాధ్యాయులకు,తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని ఉద్బోధించారు.దానికి సంబంధించిన చిత్రాన్ని క్రింద పొందుపరుస్తున్నాము.
అతిధులుగా వచ్చిన మానిటరింగ్  బృందంతో  మా 10 తరగతి విద్యార్ధులు మరియు మా ఉపాధ్యాయులు