సరస్వతీ నమస్తుభ్యం,వరదే కామరూపిణీ,విద్యారంభం కరిష్యామి,సిద్ధిర్భవతుమేసదా! |
నిశానీల,మషీరసాల్,హరియించు,రసాక్షరాలు.
1చ. శివఢమరుక నాదంలో,కురిసిన దైవాక్షరాలు,
రసనాగ్రవిలాసి హొయల,విరిసెడు,భావాక్షరాలు,
ఓ,నా,మా,లుగ,తొలుతగ,గిలికెడు,బీజాక్షరాలు,
వాగర్ధ ప్రతిపత్తుల,కులికెడు,తేజో~క్షరాలు.....అక్షరాలు
2చ అజ్ఞాన,మహాంధకార,మడగించు,ప్రభాక్షరాలు,
విజ్ఞాన విలోచనాలు,తెరిపించు,శుభాక్షరాలు,
విజ్ఞాన విలోచనాలు,తెరిపించు,శుభాక్షరాలు,
శ్రమజీవుల,నవజాగృతి,కలిగించు,మహాక్షరాలు,
చైతన్య,మహామహస్సు,లొలికే,మధురాక్షరాలు...అక్షరాలు
౩చ. అమ్మఒడొని,బడి గుడిగా,నేర్చిన వెలుగక్షరాలు,
తేట తెనుగు నుడికారము,కూర్చిన తెలుగక్షరాలు,
తీపి గోరుముద్దలతో,చూపు ప్రేమముద్దులతో,
తొలిగురువై,తనుమలచిన,సంస్కారసుధాక్షరాలు..అక్షరాలు
తీపి గోరుముద్దలతో,చూపు ప్రేమముద్దులతో,
తొలిగురువై,తనుమలచిన,సంస్కారసుధాక్షరాలు..అక్షరాలు
4చ. అక్షర,అక్షౌహిణితో,మానస రధమురికిద్దాం.
జీవనసంగ్రామ రంగ,జయ కేతనమెగురేద్దాం.
అనుభవాల పాఠాలను,అక్షరాల,వల్లిద్దాం,
అక్షరాస్యతాసూచిని,ఊర్ధ్వదెసకు మళ్ళిద్దాం.....అక్షరాలు
అనుభవాల పాఠాలను,అక్షరాల,వల్లిద్దాం,
అక్షరాస్యతాసూచిని,ఊర్ధ్వదెసకు మళ్ళిద్దాం.....అక్షరాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి