ఈ రోజుల్లో ఇంట్లో కూర్చుని,లక్షలు సంపాదించాలనే,దురాశాపరులు ఎందరో ఉన్నరు.పైసా పెట్టుబడి లేకుండా సంపాదించడం ఎలాగా?అనేదే వారి ఆలోచన.బజార్లో 30 రూపాయలకు దొరికే ఒక వస్తువు వెలను 50రూ. చేసి 10రూ.."ఉచిత గిఫ్ట్" ఇస్తే చాలు !ఎగబడి మరీ కొంటారు.అందులో ఉండే అసలు విషయం గురించి చదువుకున్న వారు, చదువుకొన్నవారు అసలు ఆలోచించరు.కూడా ! అంటే నమ్మండి. మరికొందరు ఒకటి కొంటే!మరొకటి ఉచితం అని చెపితే చాలు !మళ్ళీ దొరకవేమోనని అప్పు చేసి మరీ ఒక్క సారే కొనేసే ఘనులున్నరంటే! ఆశ్చర్యపోనవసరం లేదనుకుంటాను ఈ రోజుల్లో.
సులభ సంపాదనతో తులతూగే వానికి మళ్ళీ కవర్లు రావడం ప్రారంభమైంది.ఈ సారి "సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెపుతానన్నారు.మేము స్టాంపులు పంపినా మీ నుండి సమాధానమే లేదు వెంటనే పంపండి"అంటూ ఉత్తరాల వెల్లువ ప్రారంభమైంది. మన తెలివైన సంపాదనా పరుడు తక్కువ తిన్నాడా? మళ్ళీ అదే దిన పత్రికలో,ఇలా మరో ప్రకటన ఇచ్చాడు
."ప్రియ పాఠకులారా !సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెపుతానన్నాను.నా ప్రకటనకు మీరంతా వెల్లువలా స్పందించారు. కాబట్టే నేనీనాడు సులభంగా లక్షాధికారినయ్యాను.మరి ఈ రోజు మళ్ళీ డబ్బు సంపాదించే మార్గం చెప్ప లేదని వ్రాస్తారేమిటి ?ఇంకేం మార్గం చెప్పాలి ?ఇదే సులభంగా డబ్బు సంపాదించే మార్గం.నేను చెప్పిన ఈ మార్గం సుసంపంన్నం చేసినందుకు మీకు మరో మారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను"అని
అదండీ !అసలు కథ అందుచేత ప్రియ వినియోగ దారులారా! లాభం లేకుండా ఏదీ ఉచితంగా ఇవ్వరని మనసు పెట్టి ఆలోచించండి!!!.ఆఫర్లు,ఫ్రీలు,అధిక శాతాలు, ఇవన్నీ పాత నిల్వలు తరగడానికీ, క్రొత్త నిల్వలు పెరగడానికి,చేసే చిట్కాలని గ్రహిస్తారుగా! నిజానికి మనం ధరలు మారుతతుల్యవేగంగా ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో.ఏదీ "ఉచితం" అనుకోవడం "అనుచితం" కాబట్టి బ..హు... ప...రాక్.............

(ఇందు లోని భావాలు !!!! ఎవరినీ ఉద్దేసించినవి !!!!!కావు )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి