26, జనవరి 2012, గురువారం

63వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు

                                చ దు వు ల కో వె ల 
బ్లాగ్ వీక్షకులకు,ఉపాధ్యాయ సోదరులకు,పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులకు 63 వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
 ఈ రోజున అనగా 26/1/2012 న మా పాఠశాలలో 63వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్యన జరిగాయి.పాఠశాల ప్రస్తుత ప్రధానో పాధ్యాయురాలు,మరియు పాలకొల్లు మండల విద్యా శాఖాధికారిణి శ్రీమతి తాన్ని ఉదయిని జాతీ పతాకాన్ని ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభం అయ్యాయి.
విప్లవ వీరుడు అల్లూరి సీతా  రామరాజు  విగ్రహం
జాతీయ పతాకావిష్కరణకై సిద్ధ పడుతున్న ప్రదానోపాధ్యాయురాలు శ్రీమతి తాన్ని ఉదయిని

ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తాన్ని ఉదయిని జాతీయ పతాకావిష్కరణ 
పతాక వందనాన్నిస్వీకరిస్తున్నవిద్యార్ధినీ విద్యార్ధులు,ఉపాధ్యాయులు
పతాక వందనాన్ని స్వీకరిస్తున్న విద్యార్ధినీ విద్యార్ధులు
పతాక వందనాన్ని స్వీకరిస్తున్న విద్యార్ధినీ విద్యార్ధులు
పతాక వందనాన్నిస్వీకరిస్తున్నవిద్యార్ధినీ విద్యార్ధులు,ఉపాధ్యాయులు


వివిధ కళల్లో ప్రతిభ కనపరచిన విద్యార్ధిని అభినందిస్తున్న
 ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తాన్నిఉదయిని,
తెలుగు సహాయకులు సి.హెచ్.ఆర్.కే.శర్మ 
పాఠశాలలో  సరస్వతీ  విగ్రహానికి పూలమాల వేస్తున్న ప్రధానోపాధ్యాయిని 
సరస్వతీ  విగ్రహానికి ప్రధానోపాధ్యాయిని పూలమాల వేస్తున్న చిత్రం
హెలెన్ కుమారి గారు అంద చేయబోయే  ఆటల పోటీల్లో ధరించే చొక్కా


ఈ నెల ౩1 వ తేదీన పదవీ విరమణ చేస్తున్నహెలెన్ కుమారి విద్యార్ధుల 5౦౦౦/-రూపాయల వ్యయంతో అందజేస్తున్న శ్రీమతి హెలెన్ కుమారి దాతృత్వంతో విద్యార్ధులకు క్రీడా దుస్తులను విద్యార్ధులకు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తాన్నిఉదయిని
శ్రీమతి  హెలెన్ కుమారి దాతృత్వంతో ,విద్యార్ధులకు ప్రధానోపాధ్యాయిని ఉదయిని గారిచే  క్రీడా దుస్తుల పంపిణీ  కార్యక్రమము
ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తాన్నిఉదయిని ప్రసంగం

 ఇటీవల ఎలెక్షన్ కమీషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన,వక్తృత్వం,చిత్ర లేఖనం పోటీలలో సీనియర్ మరియు జూనియర్ విభాగాలలో గెలుపొందిన విద్యార్ధినీ విద్యార్ధులకు పాలకొల్లు మండల రెవిన్యూ అధికారి వారు అందించిన బహుమతులు సర్టిఫికెట్లు 18 మందికి శ్రీమతి ఉదయిని అందజేశారు.ఆ చిత్రాలివి.

బహుమతులు గెలుచుకున్న విద్యార్ధులతో
వ్యాస రచనలో ప్రధమ బహుమతి గ్రహీత కానేటి ప్రియాంక

22, జనవరి 2012, ఆదివారం

"ఎల్బీ ....శ్రీరాం" ఎదురు రైలెక్కాడు (హాస్య కధ)

 అతని అసలు పేరు లొల్ల బాల శ్రీరాం ."ఎల్బోర్డ్  శ్రీరాం"మిత్రులంతా పిలిచే ముద్దు పేరది .అందరికీ ,తెలివి మెదడులో ఉంటే ,మన ఎల్బీకి తెలివి , కొంచెం మోకాలికి దిగింది .అందుకే అతనికి ఆ ముద్దు పేరు సార్ధకం అయింది .అతనికి  ఎప్పటినుంచో  సినీమా యాక్టర్ కావాలని , చిన్నకోరిక . స్నేహితులంతా మద్రాస్ వెళ్ళి ట్రై  చేయమని చెప్పడంతో , ఒక రోజు మూటా ముల్లె ,సర్దుకుని ,ఇంట్లో కూడా చెప్పా పెట్ట కుండా , తెనాలి నుంచి ,మద్రాస్ రైలెక్కేశాడు.జెనరల్ కంపార్టుమెంట్లో అతని అదృష్టం కొద్దీ పైన పడుకునే జాగా కూడా దొరికింది."ఈ తెలివి తక్కువ దద్దమ్మ!"లోకంలో తన లాంటి ,మేధావి పుట్టడం నిజంగా !ఈ ప్రజల అదృష్టం ,"అని అతని ప్రగాఢ విశ్వాసం .అర్ధ రాత్రికి "నెల్లూరు "స్టేషన్ వచ్చింది .బండి ఆగినా ,అక్కడ ఎంతో సేపాగదు కూడా !అది తెలియని మన ఎల్బీ,తన బ్రీఫ్ కేసు తీసుకొని (ఎవరైనా పట్టుకు పోతారని ) భోజనం కోసం బండి దిగాడు .క్యాంటిన్ లో భోజనం చేసి ,హాయిగా కిల్లీ కట్టించుకొని ,నముల్తూ జల్సాగా ,నిక్కి నీలిగి ,తిరిగి  బండి దగ్గరికి వచ్చాడు.ఆలోగా చెన్నైవెళ్ళే బండి వెళ్ళిపోవడం ,అదే ప్లాట్ ఫాం మీదకు హౌరా వేళ్ళే బండి రావడం కూడా  జరిగిపోయింది .ఇది అతనికేమీ తెలియదు.తాను అంత క్రితం దిగిన బండే గదా !అనుకున్నాడు పాపం .
               మెల్లగా ఒక పెట్టెలోకి ఎక్కాడు.పై బల్ల మీదికి చేరి ,బ్రీఫ్ కేసు తల క్రింద పెట్టుకొని ,పడుకున్నాడు .కాసేపటికి బండి కదిలింది .క్రమంగా బండి స్పీడందుకుంది.తాను పడుకున్నబల్లకె దురుగా నీటుగా టక్ చేసుకున్న,ఒక పెద్ద మనిషి పక్క పరుచుకోని ,దాని మీద కూర్చుని , తాపీగా సిగరెట్టు ముట్టించాడు .అతన్ని చూసి మన వాడు తిన్నగా ఉండక ,పడుకున్న గాడిదను ,లేపి తన్నించు కున్నట్లు గా ,"మీరెక్కడికి వెడుతున్నారు "?అని అడిగాడు మన మహామేధావి .అతను"వాల్తేరు" అని చెప్పాడు .ఆ మాట వినగానే ,ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టడానికే , తానూ అవతరించిన ట్లు మన ఎల్బీశ్రీ రాం , ఒక్క !వింత నవ్వు !నవ్వి , "తనలో తాను ,ఆ హా !సైన్సెంత గొప్పగా అభివృద్ధి చెందింది ?ఒకే బండిలో నేను పడుకున్నఈ బల్ల....చెన్నై వెడుతుంటే ,ఎదుటివాడు పడుకున్నబల్ల....వాల్తేరు వెళుతూ ఉందన్నమాట ఇంకా ముందు ముందు ,ఎంత అభివృద్ధి చెందుతుందో ?నా చిన్నప్పటికీ ఇప్పటికీ , ఎంత తేడా !అనుకుంటూ మెల్లగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
                   చాలా సేపటికి టీ.సీ వచ్చి మన ఎల్బీని లేపి టిక్కట్టు అడిగాడు . అతను దర్జాగా తీసి ,చూపించాడు .అది చూసి టీ.సీ "ఇదేమిటి ? చెన్నైకి టిక్కెట్టు కొనుక్కుని ,హౌరా బండిలో ఎక్కావ్ ? "అన్నాడు.అందుకతను ,ఈ హౌరా ఏమిటి ?నేను బండెక్కడమేమిటీ ?ఆ వాల్తేరు వెళ్ళేది ఎదర బల్ల ! నేను పడుకున్నబల్ల ! చెన్నైవెళ్ళేదేగదా? అన్నాడు.బండిలో ప్రయాణిస్తున్న వాళ్ళు అందరూ ఒక్కసారి పొట్ట చెక్కలయ్యేలా !గొల్లున నవ్వారు. టీ .సీకి దిమ్మ తిరిగి పోయింది .అతను దిగ్భ్రాంతి నుండి తేరుకొనే లోగానే ,"రాజమండ్రి "స్టేషన్ వచ్చింది. "చాల్చాల్లేవయ్యా ?పెద్ద మనిషివి !దిగు ! దిగు !చెన్నై వెళ్ళే బండి రేపు మధ్యాహ్నంవస్తుంది.అప్పటికీ టిక్కెట్టు!పనికి రాదు.ఇంకో  టిక్కెట్టు కొనుక్కుని ,వెల్దువుగాని !ఈ రాజముండ్రీ లో ! దిగు ! అని బలవంతాన దింపేశాడు .ఆ రైలు కాస్తా వెళ్ళిపోయింది.మన ఎల్బీ అర్ధంతరంగా పాపం  రాజమండ్రీ చేరాడు.అందుకే నన్ను" ఎల్బోర్డు  శ్రీరాం అని ఊరికే అనరు మన గడుగ్గాయిలు ! అని వాపోయాడు ,తన తెలివి తక్కువ తనాన్ని తలచుకుంటూ......