24, మే 2012, గురువారం

అక్షరాలు,జన మానస, ఫలకాల,శిలాక్షరాలు!

సరస్వతీ నమస్తుభ్యం,వరదే కామరూపిణీ,విద్యారంభం కరిష్యామి,సిద్ధిర్భవతుమేసదా!
పల్లవి: అక్షరాలు,జనమానస,ఫలకాల,శిలాక్షరాలు,
      నిశానీల,మషీరసాల్,హరియించు,రసాక్షరాలు.


1చ.  శివఢమరుక నాదంలో,కురిసిన దైవాక్షరాలు,
      రసనాగ్రవిలాసి హొయల,విరిసెడు,భావాక్షరాలు,
      ఓ,నా,మా,లుగ,తొలుతగ,గిలికెడు,బీజాక్షరాలు,
      వాగర్ధ ప్రతిపత్తుల,కులికెడు,తేజో~క్షరాలు.....అక్షరాలు

 2చ  అజ్ఞాన,మహాంధకార,మడగించు,ప్రభాక్షరాలు,
      విజ్ఞాన విలోచనాలు,తెరిపించు,శుభాక్షరాలు,
      శ్రమజీవుల,నవజాగృతి,కలిగించు,మహాక్షరాలు,
      చైతన్య,మహామహస్సు,లొలికే,మధురాక్షరాలు...అక్షరాలు


 ౩చ. అమ్మఒడొని,బడి గుడిగా,నేర్చిన వెలుగక్షరాలు,
      తేట తెనుగు నుడికారము,కూర్చిన తెలుగక్షరాలు,
      తీపి గోరుముద్దలతో,చూపు ప్రేమముద్దులతో,
      తొలిగురువై,తనుమలచిన,సంస్కారసుధాక్షరాలు..అక్షరాలు

        
 4చ.  అక్షర,అక్షౌహిణితో,మానస రధమురికిద్దాం.
       జీవనసంగ్రామ రంగ,జయ కేతనమెగురేద్దాం.
       అనుభవాల పాఠాలను,అక్షరాల,వల్లిద్దాం,
       అక్షరాస్యతాసూచిని,ఊర్ధ్వదెసకు మళ్ళిద్దాం.....అక్షరాలు

22, మే 2012, మంగళవారం

కుక్క... కాపలా!

జన్మలన్నింట!మానవ జన్మఅనేది లభించడం ఎంతో!"దుర్లభం "అన్నారు ! పెద్దలు.అలాంటి ఈ గొప్ప జన్మలో పుణ్యం మాట దేముడెరుగు ! పాపాన్ని మూట కట్టుకోకూడదు ! వెనుకటి రోజుల్లో ! ప్రముఖ కాలేజీల్లోనూ , యూనివర్సిటీల్లోనూ , హైస్కూళ్ళలో లాగా ఒక తరగతి గదిలోనే  అన్ని సబ్జెక్ట్లూ  బోధించరు .గంట కొట్టగానే ,విద్యార్ధులు ఒక సబ్జెక్ట్ గది నుంచీ , మరో  సబ్జెక్ట్ గదిలోకి మారుతూ ఉండాలి .వెనుకటికి  "అపరిచితుడు " సినిమా హీరో లాంటి ,ఒక ఆదర్శ విద్యార్ధి ఉన్నాడు. అతను ఒకానొక ప్రముఖ యూనివర్సిటీలో , చదువు కుంటున్నాడు .అక్కడి ,పద్ధతులు , అలవాట్లూ , ప్రొఫెసర్ల లాలూజీ విధానాలూ ,అతనికి ఏ మాత్రమూ నచ్చలేదు .అతను బాగా చదువుకోసం !ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ,తల్లి దండ్రులను ఎంతో బాధ పెడుతూ,ఇక్కడకు చదువుకై వచ్చాడు. ఇలా ప్రొఫెసర్లు చదువు నేర్పక పోవడం చాలా...చాలా...బాధ అనిపించింది . అయినా తనొక్కడు ! ఏమి ? చేయగలడు ? 
               కాలేజీల్లో లాగా, ఈ యూనివర్సిటీల్లో " స్వేచ్చ" అనేదే ! ఉండదు.ఇక్కడి ప్రొఫెసర్లు విద్యార్ధుల పంచ ప్రాణాలూ ,తమ గుప్పిట్లో పెట్టుకుంటారు .ఎవరైనా ! ఏమైనా ! కాస్త ! తల బిరుసుతో !ఎదిరించాడా ! వాడిని నల్లిని నలిపినట్లు నలిపేస్తారు .పోనీ !వాళ్ళుక్లాసులో పాఠాలు సక్రమంగా బోధిస్తారా ? అంటే ! అదీ శూన్యమే ! విద్యార్ధులను , పురుగుల కంటా ! హీనంగా , బానిసల్లా ,చూస్తారు .ఏదో పేరుకి పాఠాలు అయ్యాయి అనిపిస్తారు కానీ ,"విద్యార్ధులకు ఏమాత్రం అర్ధం అయింది ? "అనేది వాళ్ళకు అనవసరం . వాళ్ళ జీతాలు వేలకు వేలు ,ఎలాగూ వస్తాయనే! "ధీమా " వారికి ఎలాగూ  ఉంటుంది. పైగా మీరు "లైబ్రరీల మీద పడండి ! రిఫరెన్సులు చూసుకోండి ! నోట్సులు వ్రాసుకోండి ! పరీ క్షలు వ్రాయండి ! "అంటూ హుకుంలు జారీ చేస్తారు .అదీ !అక్కడి వాతావరణం .అన్ని యూనివర్సిటీలు  ఇలా ఉంటాయనీ ! అందరు ప్రొఫెసర్లూ ! అలా ఉంటారని !నా భావం కాదు !సుమా !
                       ఇలా ఉండగా ,ఒక రోజున ఆ విద్యార్ధి యధావిధిగా, ఒక క్లాసులో నేర్చుకోవలసిన పాఠం అయిపోయింది .వేరొక రూములోకి విద్యార్ధులు మారుతున్నారు.ఆ వరండాలో ఒక "కుక్క " పడుకొని ఉంది కొందరువిద్యార్ధులు దాన్ని, చీ.!..చీ.!.చీ !...అంటూ కొడుతున్నారు .  అప్పుడు !మన తెలివైన  విద్యార్ధికి ఒక మంచి అవకాశం దొరికింది . పైగా అదే సమయానికి , ఒక ప్రొఫెసర్ కూడా అదే మార్గాన రావడం కూడా ఆతను గమనించాడు.వెంటనే ఈ విద్యార్ధి వాళ్ళను,కొట్టడం ఆపుతూ
"అయ్యయ్యో!ఆ కుక్కను !తోలకండిరా !బాబూ !అది ఎవరనుకున్నారు గత జన్మలో ,ఈ కాలేజీలో పని చేసిన , ఈ యూనివర్సిటీ !  ప్రొఫెసరే ! వేలకోద్దీ జీతాలు పుచ్చుకుని కూడా ,సరిగ్గా విద్యార్ధులకు పాఠాలు చెప్పక , అన్యాయంగా ఈ యూనివర్సిటీ ద్వారా ,మన సొమ్ము తిన్న పాపానికి , ఈ జన్మలో ! కుక్కలా !పుట్టి ,పూర్వ జన్మ సంస్కారం వల్ల , ఇక్కడే ! ఇలా ! కాపలా కాస్తున్నాడు." అందుకని దాన్ని మనం తోలకూడదురా! " అన్నాడు.అదే సమయానికి అటుగా వచ్చే ప్రొఫెసర్ ఆ మాటలు వింటాడని వేరొక విద్యార్ధి ,అతనికి సైగ చేసాడు .అతడికి తెలియదేమో ! అని .మొండి వాడైన ఆ విద్యార్ధి ," మరేం ! మునిగి పోలేదు లేవోయ్ ! నేను చెప్పింది ఏమీ అబద్ధం కాదు .ఎవరైనా గానీ , తాము ప్రతిఫలం పొంది కూడా ,తీసుకున్న జీతానికి ,న్యాయం చేయకపోవడం తప్పుకాదూ ! దానికి "గరుడ పురాణంలో  !ఇదే శిక్ష ! సూచించారట "  అని మా తాత చెప్పాడు లేవోయ్ ! " ఇది నిజంరా ! అని ఒక చిన్న అబద్ధం విసిరాడు . తనను తాను కాపాడుకోవడానికి .పాపం ! ఆ ప్రొఫెసర్ ఏడ్పు ముఖం పెట్టుకుంటూ ,గమనించీ గమనిం చనట్లు,  వెళ్ళిపోయాడు .ఆ విధంగా  తన అక్కసును బైట పెట్టాడా తెలివైన విద్యార్ధి.


         (ఇది ! హాస్యానికి  కేవలం !కల్పితం !ఎవరినీ ,ఉద్దేసించి  కాదు )